సీఎం ప్రజా ఆశీర్వాద సభకు అత్యధిక సంఖ్యలో తరలి రావాలి…

– బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు శేషు గారి భూమారెడ్డి..

నవతెలంగాణ-బోధన్: బోధన్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు రెంజల్ మండలం నుండి బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని మండల అధ్యక్షులు శేషు గారి భూమా రెడ్డి కోరారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో రావాలని మండలంలో సుమారు 8 వేల మంది బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఫిక్, ఎండి మౌలానా, కందకుర్తి సర్పంచ్ మీర్జా కలీం బేగ్, ఆసాని అనిల్, తెలంగాణ శంకర్, ఆర్మూర్ లడ్డు, లింగారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు టి. అంజయ్య, అవేజ్, లక్ష్మణ్, తిరుపతి రాము, షబ్బీర్, సాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. తమ నాయకులను అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. మండల కేంద్రమైన రెంజల్ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు షబ్బీర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనోహర్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం శోచనీయమని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు భూమారెడ్డి పేర్కొన్నారు. యువత భవిష్యత్తు నాశనం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. పార్టీలకు సంబంధించిన గ్రామాల అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగత దూషణలకు తావివ్వకూడదన్నారు.