హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్‌కి గుణపాఠం చెప్పాలి

– 6 గ్యారంటీ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు
– ఎన్నికల ప్రచారంలో కసిరెడ్డి నారాయణరెడ్డి..
నవతెలంగాణ -కల్వకుర్తి టౌన్‌
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాయని చెప్పారు. చారకొండ మండలం జూపల్లి, తదితర గ్రామాలలో ఆయన జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీ సింగ్‌ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చేతగానితనం వల్ల కల్వకుర్తి నియోజకవర్గం అభివద్ధి విషయంలో వెనకబడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నియోజవర్గ ప్రజలకు విద్య, వైద్యం అందించడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యారెంటీ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల 2500 ఇస్తామని, 500 కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని, 15 లక్షల వరకు రైతుబంధు ఇస్తామని అన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గహలక్ష్మి పథకాలు ఇస్తామని ఇప్పటికీ అధికార పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ప్రొసీడింగులు సష్టించి లబ్ధిదారుల పేర్లతో ప్రచారం చేస్తున్నారని ఈ విషయంపై ప్రజలు అధికార పార్టీ నాయకులను నిలదీయాలని కోరారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కల్వకుర్తి నియోజకవర్గం లో అధికార పార్టీ అభ్యర్థికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ అభివద్ధి పైనే ప్రత్యేక దష్టిసారించి సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని విద్యారంగంలో మరింత అభివద్ధి చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా కషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు జూపల్లి వెంకటయ్య యాదవ్‌, గ్రామ సర్పంచ్‌ బాలరాజు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.