ఎండల తీవ్రతతోపాటు ఆకాశం మబ్బులు పట్టి జల్లులు కురవడంతో బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామం నుండి చీకటిమామిడి ప్రధాన రహదారి పక్కనే ఉన్న నాగిరెడ్డి కిష్టారెడ్డి పొలం పక్కన చెట్లు ఆహ్లాదాన్ని కనబరుస్తుంది.మరోవైపు చెట్టుకొమ్మలు ప్రమాదకరంగా మారింది.ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకుంటుందోనని రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి వృక్షాలని చూసి నిత్యం ఈ మార్గం వెంట వెళ్లే వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.చెట్లు మీద పడే ప్రమాదం ఉందని, చెట్టును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.