దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు..

The person who committed the theft was arrested.– బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు..
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని రాంసింగ్ రాజ్ పురోహిత్ ఇంట్లో ఈ నెల 8న చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళం వేసి ఉన్న రాంసింగ్ ఇంట్లోకి చొరబడిన నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన శంకర్ రాం దేవసి మూడు తులాల మంగళసూత్రం, ఒక తులం బంగారు చైన్, వెండి ఆభరణాలు దొంగిలిం చాడు. శుక్రవారం రాత్రి  నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జన్నారంలో దొంగిలించిన సొత్తుతో పాటు, గతంలో లక్షెట్టిపేట మండలం తిమ్మాపూ ర్లో అపహరించిన మూడు తులాల బంగారు ముద్దను స్వాధీనం చేసు కున్నారు. బజార్హీత్నూర్, ఇచ్చోడలోనూ శంకర్ రాం  దేవసి దొంగతనా లకు పాల్పడినట్లు సీఐ అల్లం నరేష్, చెప్పారు. కార్యక్రమంలో జన్నారం ఎస్సై రాజ వర్ధన్, ఐడి పార్టీ పోలీసులు తుకారాం,భాస్కర్ ఉన్నారు.