బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరిక

– అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి చేరిక
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని  బాబుల్గమ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నుండి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి గ్రామ అధ్యక్షుడు వీరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరరు.వీరికి ఎమ్మెల్యే హన్మంత్ షిండే మరియు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఖండువాలు వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి  కార్యక్రమలను ఆకర్షితులై కాంగ్రెస్  పార్టీ విడి అధికార  బిఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు.అంతే కాకుండా బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు మంచి  భవిష్యత్తు ఉందని గ్రహించి గ్రామ పెద్దల సహకారంతో పార్టీలోకి చేరామని పలువురు అన్నారు  అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన మా గ్రామ అభివృద్ధి చెందలేదని మేము గతంలో జుక్కల్ మండలంలో ఉన్నప్పటికీ మండలాల విభజన తర్వాత సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ లో మా గ్రామం వెళ్లడం వల్ల ఏడు సంవత్సరాల నుండి మా గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది నూతనంగా ఏర్పడిన పెద్ద కొడంగల్ మండలంలో చేరుతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి మా గ్రామాన్ని పెద్దకొడప్ గల్ మండలంలో చేర్చడం జరిగిందిఅన్నారు.అనంతరం జుక్కల్ శాసన సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో  దూసుకెల్లడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదోడికి లబ్ధి అయ్యేవిధంగా అనేక సంక్షేమ పథకాలు  ప్రవేశ పెట్టి ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కిందని ఆయన కొనియాడారు.బాబుల్గం గ్రామానికి చెందిన నాయకులు  పార్టీలో చేరడం చాలా సంతోషకరమని పార్టీలో చేరిన వారు పార్టీ కోసం కష్టపడితే వారికి కూడా పార్టీ గుర్తిస్తుందని ఎటువంటి సమస్యలు ఉన్న ఎంపీపీ ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. గత 50 సంవత్సరల క్రితం పాలించిన నాయకులు ఎక్కడైన అభివృద్ధి  పనులు చేశారా అని ఎద్దవా చేశారు.గతంలో మీ గ్రామాలు ఎలా ఉందో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో మీకు ఇప్పటికే అర్థం అయిందాని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి పేదోడి సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప రెడ్డి, సర్పంచ్  ఎస్ కె గౌస్,ఉప సర్పంచ్ నర్సు గొండ, మాజీ సర్పంచ్ విట్ఠల్ రెడ్డి, సురేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.