
– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని అబ్బాపూర్ (బి) తాండాలో అర్ధరాత్రి బాల్య వివాహంపై స్పందించి సిడిపిఓ చైతన్యకుమార్ ఐసిడిఎస్ అధికారులతో కలిసి అబ్బాపూర్(బి) తాండలో శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్ళగా పెళ్లి సంబంధికులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులను విచారణ చేపట్టగా బాల్య వివాహం వాస్తవమేనని తెలుసుకొని స్థానిక కార్యదర్శి షేక్ హైమద్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో పెళ్లికి సహకరించిన ఎంపీటీసీ భర్త శంకర్ తో పాటు పెళ్లి పెద్దలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పెళ్లి కుటుంబ సభ్యులు పరారీ లో ఉన్నారు. పోలీసులు విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఐసిడిఎస్ సూపర్వైజర్ భాగ్య లక్ష్మి, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది బీక్ సింగ్, ముజాహిద్, అంగన్వాడి శోభ తదితరులు ఉన్నారు.