నవతెలంగాణ – జుక్కల్
బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ వ్యాదితో చికిత్స పొందుతున్న వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సహయనిధి మంజూరు కు కృషిచేసిన జహిరాబాద్ ఎంపి బిబి పాటీల్ కృషి వలన సహకారంతో మంజూరు చేసారని నాగల్ గావ్ సర్పంచ్ కపిల్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతు నాగల్ గావ్ గ్రామానికి చెందిన సంతోష్ గత కొంత కాలంగా క్యాన్సర్ మహమ్మారిన బ్రేయిన్ ట్యూమర్ వ్యాదితో బాదపడుతున్నాడు. హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఇన్ పేశెంట్ గా చేరి ఆసుపత్రిలో వెల్లిన రోగికి చికిత్సలు చేసినప్పడికి చివరిగా బ్రేయిన్ కు శస్త్ర్ర చికిత్స తప్పక చేయలని వైద్యులు సూచించారు. వెంటనే పెషెంట్ తండ్రి హరికృష్ణ తన దృష్టికి తెవడంతో వెనువెంటనె జహిరాబాద్ ఎంపి బిబి పాటీల్ కలిసి దృష్టికి తీసుకెళ్లాము. స్పందించిన ఎంపి పాటీల్ వెంటనె సీఎం గారిని కలవడం జర్గింది. వారు స్పందించి చికిత్స చేసెందుకు ఎల్ఓసీ కోరి వైద్యం, శస్త్ర చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేసి వైద్యం ప్రారంబించారు.ఆదివారం నాడు వైద్యం కొరకు రూపాయలు ఐదు లక్షలు మంజూరు పత్రాన్ని అందించి , డబ్బులను ఆసుపత్రి ఖాతాలో జమా చేసి బ్రేయిన్ ట్యూమర్ చికిత్స ప్రారంబించారని కుటింబీకులు తెలిపారను పేర్కోన్నారు.