ప్రభుత్వ పాఠశాలలో పోషకుల సమావేశం 

A meeting of patrons in a government schoolనవతెలంగాణ – లోకేశ్వరం
ఉన్నత అధికారుల అదేశాను సారం మండలంలోని మన్మధ్, రాజుర ప్రాథమిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలతో పాటు ఆయా పాఠశాలలో శనివారం పోషకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రెగుంట రాజేశ్వర్, మల్కగౌడ్ మాట్లాడుతూ.. పాఠశాలకు గ్రామస్తులు అందిస్తున్న సహకారంతో పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని, తల్లితండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని సూచించారు. ప్రతి నెలలో  మూడవ శనివారం పోషకులు సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి పిల్లల తల్లితండ్రులు తప్పక హజారు కావాలని కోరారు. చదువు విషయంలో పిల్లలలో ఏమైనా సందేహాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆయా తరగతుల ఉపాద్యాయులు పోషకులకు వారి పిల్లల యొక్క హజరు శాతం, ఇటీవల నిర్వహించిన ఎఫ్ఏ పరీక్ష ఫలితాలు, పార్జెక్ట్ వర్క్ ఫలితాలను విద్యార్థుల తల్లి తండ్రులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు, పాల్గొన్నారు.