సదాసీదాగా జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశం

నవతెలంగాణ-వనపర్తి
వనపర్తి జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశం సాదాసీదాగా కొనసాగింది. (6)ఆరవ, (1)ఒకటవ, (7)ఏడవ, స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్‌ వనపర్తి (6)ఆరవ స్థాయి సంఘం ( సాంఘిక సంక్షేమం) సమావేశం కాట్రావత్‌. లక్ష్మి జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ( జడ్పిటిసి) పానగల్‌ అధ్యక్షతన జరిగింది. జిల్లా ప్రజా పరిషత్‌ వనపర్తి (1)ఒకటవ ( ప్రణాళిక మరియు ఆర్థిక ) (7 ఏడవ( నిర్మాణ పనులు), స్థాయి సంఘంల సమావేశం ఎం. భార్గవి జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ( జడ్పిటిసి) గోపాల్పేట్‌, సామ్య, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ( జడ్పిటిసి) ఘన్పూర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని జిల్లాలోని శాఖల వారీగా చేపడుతున్న సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. వనపర్తి జిల్లా గిరిజన అభివద్ధి అధికారి మాట్లాడుతూ జిల్లా గిరిజన సంక్షేమ అభివద్ధి శాఖ జిల్లాలో చేపడుతున్న గిరిజన వసతి గహంలో నిర్వహణ, కళాశాలల వసతి గహములు, కార్పొరేట్‌ విద్య, గిరిజనుల పదవ తరగతి ఉత్తీర్ణత, ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు, గిరిజన అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి, ఉచిత విద్యుత్‌, పోడు భూములు, గిరిజనులకు అందిస్తున్న ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీం ల గురించి వివరించారు. వనపర్తి జిల్లా వెనుకబడిన తరగతుల అభివద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న కార్యక్రమాలు పోస్ట్‌ మెట్రిక్‌ కళాశాల వసతి గహాల నిర్వహణ, కార్పొరేట్‌ విద్య, బిసి లా – గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు న్యాయ పరిపాలనలో శిక్షణ, కళ్యాణ లక్ష్మి పథకం అమలు, కులాంతర వివాహాల ప్రోత్సాహక బహుమతులు, మహాత్మ జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ విద్యానిధి, దోబీ ఘాట్‌ పథకము, బీసీ కార్పొరేషన్‌ కుమ్మరి చేతివత్తుల వారికి సబ్సిడీ పథకాలు, ఉచిత విద్యుత్‌ చేతివత్తులకు 100 శాతం సబ్సిడీ పథకాలను వివరించారు. 1)ఒకటవ ( ప్రణాళిక మరియు ఆర్థిక ) (7 ఏడవ( నిర్మాణ పనులు), స్థాయి సంఘంల సమావేశ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రవణ్‌ కుమార్‌, మల్లయ్య జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ పి ఐ యు డివిజన్‌ వనపర్తి, టి మెగా రెడ్డి కార్యనిర్వాహక మిషన్‌ భగీరథ ఇంట్రా విభాగం వనపర్తి, నరసింహులు నీటిపారుదల శాఖ అధికారి, నాగేంద్ర కుమార్‌ పర్యవేక్షణ అభయంత, ఆపరేషన్‌ సర్కిల్‌ టి ఎస్‌ ఎస్‌ పి డి సి ఎల్‌, బి. దేశ్య కార్యనిర్వాహక రోడ్డు మరియు భవనముల శాఖ వనపర్తి.ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆరవ స్థాయి సంఘం ( సాంఘిక సంక్షేమం) సమావేశం
కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్‌ కో ఆపెన్‌ సభ్యులు ఎండి. మునీరుద్దీన్‌, జిల్లా పరిషత్‌ సీఈవో శ్రవణ్‌ కుమార్‌, ఏ నుషిత జిల్లా షెడ్యూలు కులాల అభివద్ధి అధికారి, ఎం మల్లికార్జున్‌ జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు షెడ్యూలు కులాల సేవ సహకార సంఘం లిమిటెడ్‌ వనపర్తి, ఎం శ్రీనివాస్‌ జిల్లా గిరిజన అభివద్ధి అధికారి వనపర్తి, బీరం సుబ్బారెడ్డి జిల్లా బీసీ అభివద్ధి మరియు బీసీ సంక్షేమ అధికారి, శ్రీమతి పద్మావతి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ,ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.