డెబ్భైౖ ఏడేళ్ల స్వరాజ్యం
కాలప్రవాహంలో ఈదుతూ
తీర్పుల తీరాల్ని చేరడానికి ప్రతీ
ఐదేళ్ళకోసారిలానే నేడు కూడా
బ్యాలెట్ పెట్టెలో శూన్యం నిండా కళ్ళు చేసుకొని
ఎన్నికల రంగస్థలం తెర తీసికొని
ఉత్కంఠగా ఎదురు చూస్తోంది!
రేపటి నవభారతం పురుడు పోసుకొనేందుకు
స్వేచ్ఛా విహాంగాల్లాంటి
ఏ పాట్లూ లేని స్వచ్ఛమైన ఓట్ల కోసం..
బంగారు భవిత నిర్మించే బాధ్యతనే
ఓటుగా వేసి ప్రగతి ఫలాల మహావక్షాన్ని
నేటి బ్యాలెట్ బాక్సులోంచే సష్టించుకొందాం..
ప్రలోభాలు ఉచితాలు తాయిలాలు
ఇలాంటి క్షణికాలు కాలగర్భంలో
కరగక తరగక ఆగవు కదా!
కానీ, దేశమొక్కటే సత్యం
మనం నిలబెట్టుకోవాల్సిన నిత్యం
అసలు దేశం కాదిది.. ప్రజాదేవళం!
కోట్లాది ప్రజల భవితవ్యాన్ని వాళ్ళే
ఆ నిశ్శబ్ద బ్యాలెట్ పెట్టెలో వితరణ శీలతతో రాసి
దేశం కోసం అమరులైన ఎందరో
త్యాగధనుల శైథిల్య సమాధులపై చిరునవ్వుల పుష్పాలు పూయించే
ఏ వర్ణనలకు ఏ వివరణలకు అందని అద్భుత క్షణం..!!
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253