– టీయూడబ్యూజె రాష్ట్ర నాయకులు కోహెడ ప్రసాదరావు, కోహెడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అర్శనపల్లి ముని
నవతెలంగాణ- కోహెడ:
జాతీయ మీడియా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని టీయూడబ్యూజె రాష్ట్ర నాయకులు డాక్టర్ కోహెడ ప్రసాదరావు, కోహెడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అర్శనపల్లి ముని అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు ‘‘సేవ్ జర్నలిజం’’ కార్యక్రమంలో భాగంగా మండల తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్ర గొప్పదన్నారు. అలాగే జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, అక్రిడేషన్ జర్నలిస్ట్‌లకు కేంద్రం రైల్వే పాస్‌లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్‌ల సేవలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే కాంగ్రెస్, బీజెపీ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గోని సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, కోహెడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అర్శనపల్లి ముని, ప్రధాన కార్యదర్శి ముల్కల హరీష్, కోశాధికారి కొంకటి జితేందర్, ఉపాధ్యాక్షులు రాగుల సతీష్, ర్యాకం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు వట్టిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వడ్డెపల్లి ప్రశాంత్, కార్యవర్గ సభ్యుడు మీర్జాపురం సంపత్‌చారి, లింగం, వివిధ పార్టీల నాయకులు గుగ్గిళ్ళ శ్రీనివాస్, బందెల కిషన్, వేల్పుల వెంకటస్వామి, పేర్యాల సాగర్‌రావు, గాజుల వెంకటేశం, దూలం శ్రీనివాస్‌గౌడ్, కరివేద నర్సింహారెడ్డి, శంకర్, నంగునూరి శ్రీనివాస్, గూడ స్వామి, వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గోన్నారు.