సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథమ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రమిది. సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. నవంబర్ 8న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు మేకర్స్. ఓ తెలుగు సినిమా టీజర్‌ని అమెరికాలో విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో యూనివర్శిటీ స్టూడెంట్స్‌తో పాటు అమెరికాలోని సినీ ప్రేమికులు, తానా నాటా అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మాట్లాడుతూ, ‘మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకుని సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ అంశాలకు మంచి ట్విస్ట్‌లు జోడించి ఈ చిత్రం రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్ అందరికి గూజ్‌బంప్స్ తీసుకొచ్చే విధంగా వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్ విజువల్స్ కూడా ఈ చిత్రంలో ఉంటాయి’ అని అన్నారు.