సామ్‌సంగ్‌ నుంచి కొత్త గేమింగ్‌ మానిటర్‌

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ నూతన గేమింగ్‌ అనుభవాల కోసం ఒడిస్సెరు ఒఎల్‌ఇడి జి9 గేమింగ్‌ మానిటర్స్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇందులోని ఫ్రీసింక్‌, ఎఎండి ఫ్రీసింక్‌ ప్రీమియం ప్రో, గేమింగ్‌ హబ్‌ ఫీచర్లు గేమింగ్‌ అనుభవాన్ని పెంచనున్నాయని పేర్కొంది. నియో క్వాంటమ్‌ ప్రాసెసర్‌ ప్రో అత్యంత ఆధునిక గేమింగ్‌, సినిమా వంటి అనుభవాన్ని అందిస్తోందని తెలిపింది. దీని ధరను రూ.1,99,999గా నిర్ణయించింది.