ఫోన్‌పే నుంచి అకౌంట్‌ అగ్రిగేటర్‌ సేవలు

న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపు ల వేదిక ఫోన్‌పే కొత్తగా అకౌంట్‌ అగ్రిగేటర్‌ సేవలను ప్రారంభించి నట్లు వెల్లడించింది. ఫోన్‌పేకు చెందిన అనుబంధ సంస్థ ఫోన్‌పే టెక్నాలజీ సర్వీసెస్‌ దీన్ని ఆవిష్క రించింది. వినియోగదారుల అనుమతితో వారి ఆర్థిక వివరాలను ఆర్థిక సంస్థలతో పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ సర్వీసుల ద్వారా ఖాతాదారులు తమ ఆర్థిక వివరాలను బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలతో పంచుకోవడం ద్వారా ఫైనాన్సీయల్‌ ఉత్పత్తులను, సేవలను వేగంగా పొందేందుకు వీలుంటుందని పేర్కొంది. దీని కింద కొత్తగా రుణాలు తీసుకోవడం, బీమా పాలసీల కొనుగోలు, పెట్టుబడి సలహాలు పంచుకోవడానికి మద్దతును అందించనున్నట్లు తెలిపింది. ఈ సేవల కోసం ఫోన్‌పే యాప్‌లో అకౌంట్‌ అగ్రిగేటర్‌ ఖాతాను తెరుచుకోవాల్సి ఉంటుంది.

Spread the love