ప్రారంభానికి ముస్తాబైన నూతన పాఠశాల 

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్

మండల కేంద్రంలోని మన ఊరు మన బడి పథకంలో భాగంగా నిర్మితమైన నూతన భవనాలు ప్రారంభానికి ముస్తాబయింది మన ఊరు మన బడి పథకంలో భాగంగా నూతన భవనం నిర్మాణానికి గాను ప్రభుత్వం 1కోటి86లక్షల రూపాయల నిధులు విడుదల చేయడంతో 12 గదుల నిర్మాణాన్ని పనులు పొందిన కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశాడు. గత రోజుల్లో గదుల కొరత ఉండడంతో నేడు పాఠశాలలో గదుల సమస్య తీర పోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.త్వరలో ఈ భవనం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.