పైసా రే పైసా..

ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్‌తో ‘ఓ మంచి ఘోస్ట్‌’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ సింగల్‌ ‘పైసా రే పైసా రే..’ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి, పాడారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. ఆయనతో పాటు శ్రీనివాస్‌ చింతల ఈ పాటకు రచయితగా పనిచేశారు. మంచి బీట్‌తో ఉన్న ఈ సాంగ్‌కు బాబా భాస్కర్‌ కొరియోగ్రాఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్‌ కామెడీ చిత్రమిది. మార్క్‌ సెట్‌ నెట్‌వర్క్స్‌ బ్యానర్‌పై డా. అభినికా ఐనాభాతుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కథలో కామెడీతో పాటు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే హర్రర్‌ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు.