నవతెలంగాణ-హైదరాబాద్ : ఈరోజు పక్కా సమాచారంతో SOT మల్కాజిగిరి బృందం జవహర్ నగర్ PS పరిధిలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ఆనంద్ నగర్ కాలనీలో ఇంటి పై దాడి చేసి, అక్రమంగా గంజాయి మొక్క (గంజాయి) సాగు చేస్తున్న రాజు శర్మ (25)ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు ఆరు అడుగుల గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు అప్పజెప్పరు.