
గాంధారి మండలంలోని చద్మల్ తండా గ్రామంలో వరుసగా రెండు ఇండ్లలో చొరబడి సెల్ ఫోన్లను దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగిందని గాంధారి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి గాంధారి మండలంలోని చద్మల్ గ్రామానికి చెందిన వసంతరావు మరియు గణేష్ అనే వ్యక్తులు తాము నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి మొబైల్ ఫోన్ల ను దొంగతనం చేసినారని పోలీస్ స్టేషన్లో నిన్న దరఖాస్తు ఇవ్వగా రెండు వేరు వేరు కేసులు నమోదు అయ్యాయి. అనంతరం కేసులను దర్యాప్తు చేస్తున్న గాంధారి ఎస్సై డి.సుధాకర్ విచారణ చేస్తూ ఈరోజు వాహనాల తనిఖీలు కామారెడ్డికి చెందిన కళావతి.సంతోష్ సింగ్(27) అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు మరియు రెండు వెండి కడియాలను స్వాధీన పరచుకొని అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించడంజరిగిందని ఎస్.ఐ సుధాకర్ తెలిపారు.