– ఎమ్మెల్సీ కే కవిత ఆకాంక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఎన్నికల్లో సింగరేణిలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రయివేటీకరణను అడ్డుకున్న ఘనత ఆయనదేనని చెప్పారు. ఆదివారం సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి, ఆర్టీసీ సంస్థల ప్రయివేటీకరణను నిలుపుదల చేసిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పారు. వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు