కోలీవుడ్ అగ్ర హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘మిస్టర్ ఎక్స్’. మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనఘ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కొన్ని వారాల క్రితం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ని అందుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందు తున్న ఈ చిత్రానికి ‘ఎఫ్‌ఐఆర్’ ఫేమ్ మను ఆనంద్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్ని మన దేశంతోపాటు ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.