బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత


ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్
అధికారులు కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ- కంఠేశ్వర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో స్వయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కారులో నుంచి దిగి తనిఖీలకు కవిత సహకరించారు. క్షుణ్ణంగా తనిఖీలకు సహకరించినందుకు కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.