కొలిప్యాక గ్రామంలో ఒకరికి పోలీసు కొలువు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవలే విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో జక్రాన్ పల్లి మండలము కొలిప్యాక్ గ్రామానికి చెందిన బి.శృతి గౌడ్ పోలీసు ఉద్యోగం సాధించారు. ఉస్మానియా క్యాంపస్ లో ఎంఎస్ సి మాథ్స్ చదువుతు పోలీసు కొలువు సాధించిన శృతి, ఈ సందర్బంగా శృతి మాట్లాడుతూ.. ఇష్టంతో,కష్టంపడి చదివనని అందుకే పోలీసు ఉద్యోగము సాధించానని అన్నారు.మా నాన్న గీత వృత్తి చేసుకుంటూ నన్ను కష్టపడి చదివించడని గుర్తుచేశారు.పోలీసు ఉద్యోగము సాధించినందుకు గర్వంగా ఉందని శృతి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.