రైతాంగ ఉద్యమానికి గర్వించదగన చరిత్ర

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ 
నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ రైతాంగ ఉద్యమానికి గర్వించదగన చరిత్ర ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. నాందేడ్ వాడలోని , రైతుసంఘం కార్యాలయంలో జరుగుతున్న రైతు సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరగతులలో రైతాంగ ఉద్యమాలు – విశిష్టత అనే అంశంపై ఆయన మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా కాడి, మేడి పట్టారని అన్నారు. జమీందారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకే భూమిపై సర్వహక్కులు అందేలా పోరాటాలు చేసిందని అన్నారు. బాంచన్ దొర నీ కాల్మొక్త అనే తెలంగాణ రైతు జూలు విధించి నిజాం నిరంకుశ కోరల్ని పీకి దున్నేవాడిదే భూమి అంటూ గర్జించిందన్నారు. ముల్లు గర్ర పట్టిన రైతే తుపాకి పట్టి శత్రువుల్ని పారదోలాడని అన్నారు. మిలటరీని ఎదుర్కొని ఉద్యమించాడని గుర్తు చేశారు. జమీందారీ రద్దు తో పాటు భూమిపై హక్కులు ఇవ్వాలని ఇవ్వాల్సి వచ్చిందని, సీలింగు చట్టాలు తెచ్చాయని, కౌల్దారి రక్షణ చట్టాలు తేవాల్సి వచ్చిందని, బంజారా భూములు పంపకం చేపట్టిందని అన్నారు. నాగార్జున సాగర్, పోచంపాడు, శ్రీశైలం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చాయంటే అది రైతు ఉద్యమాల చలవే అని అన్నారు. ప్రపంచీకరణ వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేసిన ఫలితంగా రైతాంగం అప్పులపాలై దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు మూలమైన ఆర్థిక సంస్కరనలకు వ్యతిరేకంగా పోరాడుతూనే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యమాలు చేసిన ఫలితంగా రుణమాఫీ పథకం తీసుకురావాల్సిన పరిస్థితిలోకి ప్రభుత్వాలను నెట్టిందని అన్నారు. విద్యుత్తు సవరణలను వ్యతిరేకిస్తూ పోరాటం చేయడం ఫలితంగానే ఉచిత విద్యుత్ అమలవుతుందని గుర్తు చేశారు.
          సుదీర్ఘ రైతు ఉద్యమ ప్రస్థానం త్యాగాలతో పునీతమైనదని అన్నారు. పాలకవర్గాల తర్కశత్వానికి ఎందరో రైతు బిడ్డలు బలయ్యారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది నేల కోరిగారని అన్నారు. భూమికోసం కూలి కోసం కౌలు తగ్గింపు కోసం గిట్టుబాటు ధరల కోసం విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో అనేకమంది అసువులు భాషారని అన్నారు. ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంలో రైతాంగం పోరాటం చారిత్రాత్మకమైనదని కొని ఆడారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించడం కోసం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. రానున్న కాలంలో ప్రగతిశీల ఉద్యమాలకు శక్తులకు ఊపునిచ్చే ఉద్యమాలు రావడంలో సందేహం లేదన్నారు. ఇది మరీ రైతాంగ ఉద్యమాలను మరింత సంఘటిత పరుస్తుందన్నారు. రానున్న కాలంలో ఎలాంటి పరిణామాన్ని అయినా దీటుగా ఎదుర్కొనే విధంగా రైతు సంఘాన్ని తీర్చిదిద్దాలన్నారు. చరిత్ర నుండి అనుభవాలు గుణపాటాలు తీసుకొని రైతు సంఘం మరింత ముందుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం గంగాధరప్ప, పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, దేవేందర్ సింగ్, నిరడి గంగమని, ముతెన్న, సాయిలు, గణేష్, గంగారాం తదితరులు పాల్గన్నారు.