అరుదైన అవకాశం

A rare opportunityఅభిరుచిగల నిర్మాతగా, ప్రముఖ పంపిణీ దారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న మోహన్‌ ముళ్ళపూడిని తాజాగా ఓ అరుదైన అవకాశం వరించింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు, ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు, జూబ్లీహిల్స్‌, కరీంనగర్‌, హిమాయత్‌నగర్‌ లోకల్‌ అడ్వైజరి కమిటీ సభ్యునిగా మోహన్‌ ముళ్ళపూడి నియమితులవ్వడం విశేషం. గతంలో పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గానూ వ్యవహరించిన ఆయన ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌కు (ఎఫ్‌ఎన్‌సిసి) హానరబుల్‌ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌, కరీంనగర్‌, హిమాయత్‌నగర్‌లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివద్ధిలో, కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులలో లోకల్‌ అడ్వైజరి కమిటీ మెంబర్‌గా మోహన్‌ ముళ్ళపూడి చేపట్టిన బాధ్యతలను నిర్వహిస్తారు.