నిస్పృహ ఊపిరి

నిస్పృహలో ఉగ్గపట్టుకోవడానికి
ఆటుపోట్లకి చెదరని చిత్రం
ఊహలకు ప్రాణం పోస్తుంది
కడలి దాటిపోయిన దశ్యాలన్నీ
శిధిల రంగులు సశింపజేస్తూ
నిశ్శబ్దమైన ఆశల గతాన్ని ఆలోచిస్తున్నాను

పిడికెడు మట్టితో
చుట్టుపక్కన తలా పరిశీలన చేస్తుంది
చీకటి రాత్రి కదలికల తరగమేంటో
కలగలిపే గమ్యాలెప్పుడు
కాలం కపోలంలా
ఇద్దరి చుట్టూ కాపు కాస్తుంది
అక్కెర వచ్చే ముళ్లదారులన్నీ
పూలకోనలుగా విచ్చుకుంటాయి
కనిపెట్టవలసిన నిమిషాలలో
అయస్కాంతంలా తిప్పుతుంది
నిల్చున్నప్పుడు హదయ సూత్రం
ఎడమవైపు గమనిస్తుంది
రెక్కలు విప్పిన జీవిత సంఘర్షణ
ప్రశాంతత సౌందర్యాన్ని వెతికిస్తుంది

విస్తరించే ఊపిరిలా
పదిల పరుచుకునే కోల్పోయిన
గుండెకి హత్తుకునేలా
గాలి మోసుకొచ్చే నీలినీడలన్నీ
చిరునవ్వుల సెలవిచ్చే
నిస్సహా ఊపిరి
హదయ సంఖ్యాతను ప్రతిధ్వనిస్తుంది
– బూర్గు గోపికష్ణ, 7995892410