– దోమలతో పొంచివున్న వ్యాధుల ముప్పు
– వైరస్ వ్యాప్తికి అనుకూలంగా తేమ
– పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
– నీరు నిల్వలేకుండా చూసుకోవాలి
నవతెలంగాణ – నిజామాబాద్
వర్షాకాలం వాతావరణం మారడంతో పాటు అంటువ్యాధులు ప్రమాదం పెగుతుంది. దోమల నుంచి కంటికి కనిపించని వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఈ సీజనలోనే వృద్ధి చెందుతాయి. ప్రధానంగా దోమకాటుతో ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటారు. దోమ చిన్నదే కానీ దాని కాటు వల్ల వచ్చే వ్యాధులు మాత్రం చాలా ఉన్నాయి. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మొదడువాపు తదితర వ్యాధులన్ని దోమలు కుట్టడం ద్వారా వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీజనల్ వ్యాధి వ్యాపిస్తుండడంతో వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం దోమకాట వల్ల వస్తున్నవే.
ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటావైరస్ అనే వేల రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు నీరు, ఆహారంలో కలిసినప్పడు అతిసార, డయేరియా వ్యాధులు వస్తాయి. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా నీళ్ల విరేచనాలతో పాటు విరేచనాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, వర్షంలో తడవడం వంటి కారణాలతో జలుబుతో పాటు వైరల్ ఫీవర్‌లు కూడా నమోదయ్యే అవకాశముంది. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే ప్రాణాపాయస్థితి ఏర్పడుతుంది.
డయేరియా
కలుషిత నీరు, కలుషిత, నిల్వ ఉన్న ఆహరం తీసుకోవడం తదితరాలతో నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరేచనాలు అయితే డయేరియాగా భావించాలి. ఎక్కువ సార్లు విచోచనాలు అవడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పోటాషియం, గ్లూకోజ్ తగ్గిపోయి రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు నీళ్లు విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందడం మంచిది.
డెంగ్యూ జ్వరం
ఏడీస్ ఈ.ఈప్టి దోమకాటు వల్ల ఈ వ్యాధి సోకుతుంది. తీవ్ర జ్వరం తలనొప్పి, కీళ్ల నొప్పలు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు, ముక్కు, మలం ద్వారా రక్తం పోవడం తదితర లక్షణాలు ఈ జ్వరం వచ్చిన వారిలో ఉంటయా.ఈ ఏడాదిలో ఇప్పటికి 50కి చేరుకున్నాయి.
చికున్ గున్యా
డెంగ్యూ జ్వరం లక్షణాలన్నీ ఈ వ్యాధి సోకిన వారిలో ఉంటాయి. రక్తస్రావం మూత్రం ఉండదు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు దీర్ఘకాలం ఉంటాయి. జిల్లాలో రెండేళ్లుగా ఎలాంటి కేసుల నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు.
మలేరియా..
ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా జ్వరం వస్తుంది. చలి వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం వస్తూపోతూ ఉంటుంది. వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటపడేందుకు రెండు వారాలు పడుతుంది. జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్షలు చేయిస్తే మలేరియా ఉందో లేదో తెలుస్తుంది. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయకపోతే నెలల తరబడి వేధిస్తుంది.
పైలేరియా
క్యూలెక్స్ దోమ ద్వారా ఫైలేరియా(బోధకాలు) వ్యాధి సోకుతుంది. తరుచుగా జ్వరం రావడం చంకల్లో గజ్జల్లో బిళ్లలు కట్టడం, శరీరంలోని అవయవాల వాపు ప్రత్యేకించి కాళ్లు, చేతులు, చాతీ వాపు ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు. ఈ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో వైద్యం చేయించాలి. లేదంటే బోధకాలుతో శాశ్వతంగా బాధపడాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాక్సిన్లు, మందులు అందుబాటులో ఉన్నాయ.
మెదడు వాపు
క్యూలెక్స్ దోమ కాటువల్ల పందుల సంచారం వల్ల ఈ వ్యాది వస్తుంది. ఇది ఎక్కువగా 15ఏండ్లలోపు పిల్లలకు వస్తంది. చిన్నప్పుడే వాక్సిన్ వేయించడం వల్ల వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. జ్వరం రావడం, తగ్గడం ఈ వ్యాధి లక్షణం. తగిన చికిత్స చేయించకపోతే పక్షపాతం, ఫిట్స్ వచ్చి శాశ్వతంగా దివ్యాంగులుగా మారే ప్రమాదముంది.
నియంత్రణ ఇలా..
దోమలను నియంత్రించాలంటే ఇంటిలోపల, బయట నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండా ఇండ్లలో వారంలో ఒక రోజు డ్రైడేను పాటించాలి. ఇంటి అవరణలో కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కూలర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎయిర్ కూలర్‌లు, పూలకూండీలలో నీటిని మూడు రోజులకు ఒకసారి మార్చాలి. వారానికి ఒకసారి నీటి గుంతల్లో కిరోసిన్ వేయాలి. మున్సిపల్, పంచాయతీ అధికారులతో మాట్లాడి ఫాగింగ్ చేయించాలి. ఉదయం, సాయంత్రం కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా దోమ తెరలు తప్పనిసరిగా వాడాలి.