యూనివర్సిటీ అభివృద్ధి కొరకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలి..

– యూనివర్సిటీలో  ఆడిటోరియం నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలి …
– ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎస్
– ఎఫ్ ఐ వినతి పత్రం అందజేత..
యూనివర్సిటీ అభివృద్ధి కొరకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని, యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలని, పలు విద్యారంగ సమస్యలనూ  పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు సమస్యలతో కూడిన  వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవు తున్నదని, ప్రధానంగా సంక్షేమ వసతిగృహలు, గురుకుల, కెజిబివి, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచామని ప్రకటించిన అవి ఎక్కడ అమలు కావడం లేదని వాపోయారు. గత ఏడాది కాలం నుండి హస్టల్స్ మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు.గత నాలుగేళ్ల నుండి సుమారు 5,177 కోట్లు రూపాయల స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయలేదని పేర్కొన్నారు.వసతి గృహ విద్యార్ధులకు కాస్మోటిక్ ఛార్జీల ఉసేలేదని ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీకి ఆడిటోరియాన్ని నిర్మించాలని, దాంతో పాటుగా విద్యార్థుల దేహదారుడ్యం కోసం ఓపెన్ జిమ్ , ఎన్ సి సి
 ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా అదిలాబాద్, నిర్మల్, మెదక్ కళాశాలలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకోవచ్చే విదంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేశ్, నాయకులు చిత్రు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.