పండుగలా క్రీడా దినోత్సవం!

A sports day like a festival!– డివైఎస్‌ఓల సమీక్ష సమావేశంలో శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌
హైదరాబాద్‌ : హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో డివైఎస్‌ఓ (జిల్లా యువజన క్రీడాధికారులు)ల సమీక్ష సమావేశంలో శాట్స్‌ చైర్మెన్‌, క్రీడాశాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్‌, డైరెక్టర్‌ లక్ష్మి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘క్రీడా రంగంలోకి నవ తరాన్ని నడిపించే బాధ్యత స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులపై ఎంతో ఉంది. యువతను క్రీడా మైదానాలకు ఆకర్షితులు చేసేందుకు 29న చలో మైదాన్‌ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి’ అని శాట్స్‌ చైర్మెన్‌ తెలిపారు.