హిట్‌ ఖాయం

శివ కందుకూరి హీరోగా నూతన దర్శకుడు భరత్‌ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర’. ప్రొద్దుటూర్‌ టాకీస్‌ బ్యానర్‌లో ఎన్‌ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్‌, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్‌ కథానాయికలు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’రాజ్‌ కందుకూరికి శివ ఎంతో నేనూ అంతే. నా మొదటి సినిమా విడుదల కాకముందు నుంచే నన్ను ప్రోత్సహిస్తున్నారు. నన్ను బలంగా నమ్మారు. శివ సినిమా హిట్‌ అయితే నా సినిమా హిట్‌ అయినంత ఆనందపడతాను. ట్రైలర్‌ చాలా ఇంటెన్స్‌గా, ప్రామిసింగ్‌గా ఉంది. లవ్‌, యాక్షన్‌ నా ఫేవరేట్‌ జోనర్‌. సినిమా మంచి అనుభూతిని ఇచ్చి పెద్ద విజయం సాధిస్తుంది. ఈనెల 23న అందరూ థియేటర్‌లో సినిమాని చూసి ఆదరించండి’ అని అన్నారు. ప్రతి నటుడికి ఒక బకెట్‌ లిస్టు ఉంటుంది. రా సెట్టింగ్‌ ఫైట్‌ చేయాలి, డ్యాన్స్‌ చేయాలి, మాస్‌ పాట ఉండాలి.. ఇవన్నీ నాకు ‘మను చరిత్ర’ కంప్లీట్‌ చేసింది. విశ్వక్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మంచి సినిమా ఇస్తున్నాం. ఎవరినీ నిరాశ పరచదు. దర్శకుడు భరత్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతని కోసం సినిమా హిట్‌ కావాలి’ అని హీరో శివ కందుకూరి చెప్పారు.
మేఘా ఆకాష్‌ మాట్లాడుతూ, ‘చాలా కష్టపడి, ఇష్టంతో చేసిన చిత్రమిది. పాటలు, టీజర్‌, ట్రైలర్‌ మీకు నచ్చడం ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ కావాలి. మీ అందరూ ‘మను చరిత్ర’ థియేటర్‌లో చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి’ అని తెలిపారు. దర్శకుడు భరత్‌ మాట్లాడుతూ,’ట్రైలర్‌ లాంచ్‌ చేసిన విశ్వక్‌ సేన్‌కి కతజ్ఞతలు. మేఘ ఏంజెల్‌లా ఈ సినిమాకి న్యాయం చేసింది. సుహాస్‌, డాలీ ధనంజరు చాలా మంచి పాత్రలు చేశారు. హీరో శివ .. ఈ సినిమా ప్రయాణంలో నా ఫస్ట్‌ లవ్‌ అయిపోయారు. ఈ జర్నీ ఇలానే కొనసాగాలని ఉంది’ అని అన్నారు. ఈ చిత్రం ఈనెల 23న శ్రీ విజయ ఫిల్మ్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.