తలపై పలకతో కొట్టిన టీచర్‌.. విద్యార్థి మృతి

– హోంవర్క్‌ చేయలేదని.
– రామంతపూర్‌ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో ఘటన
నవ తెలంగాణ-ఉప్పల్‌
బలపం.. పెన్సిల్‌ పట్టుకుని నేర్పించాల్సిన టీచర్‌ చిన్నారిపై కర్కషంగా ప్రవర్తించారు. హోంవర్క్‌ చేయలేదని విద్యార్థి తలపై పలకతో కొట్టడంతో పసి హృదయం తట్టుకోలేక విలవిల్లాడి ప్రాణం విడిచాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు- రాధ దంపతులు రామంతాపూర్‌ వివేక నగర్‌లో నివసిస్తున్నారు. వారి కుమారుడు హేమంత్‌ స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు.