నూతనంగా ఎన్నికైన ఆలూర్ సొసైటీ చైర్మన్ ను సన్మానించిన ఉపాధ్యాయ బృందం

నవతెలంగాణ  ఆర్మూర్ : ఇటీవల  ఆలూరు  ప్రాథమిక  వ్యవసాయ  సహకార  సంఘం చైర్మన్  గా పదవీ  బాద్యత లను  స్వీకరించిన   తంబూరి శ్రీనివాస్ ను శనివారం మండలంలోని ఇస్సపల్లి పాఠశాల  తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల  ప్రధానోపాధ్యాయులు   రాజా గంగారాం, గ్రామ  సర్పంచ్   దార్ల  దీవెన, రైతు సమన్వయ సమితి నాయకులు  దార్ల  రాజు, ఎంపీటీసీ లినిత మహేష్, ఉప  సర్పంచ్ మల్లేష్, ఎస్ఎంసి కమిటీ చైర్మన్  జ్ఞానేశ్వర్  ఉపాధ్యాయులు జగదీష్, ఎన్ వి కృష్ణారెడ్డి, భానుప్రకాష్ , శ్రీనివాస్, మాలతి, వీణా, రాజేష్  తదితరులు  పాల్గొన్నారు.