
స్థానిక ఆయిల్ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఫాం ఆయిల్ పరిశ్రమను మంగళవారం ఆయిల్ఫెడ్ జోన్ ఆయిల్ ఫాం సొసైటీ బృందం సందర్శించింది. ఇందులో గెలలు వాహనాల సీరియల్, ఫ్యాక్టరీకి గెలలు తెచ్చిన రైతులు,వాహన డ్రైవర్లు,వర్షం లో తడవకుండా ఎండలకు ఇబ్బంది పడకుండా నిర్మిస్తున్న ఫార్మర్ షెడ్, క్యాంటీన్, టాయిలెట్ లు, నిర్మిస్తున్న తీరు, దిగుమతులు వేగంగా జరుగుటకు ఎర్పాటు చేసిన రెండవ వే బ్రిడ్జ్,కొత్త గా నిర్మించ తలపెట్టిన బాయిలర్ స్థలం, ఫ్లాట్ ఫామ్ పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేశారు. రైతులు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, వినతులు కు స్పందించి చేపట్టిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి అని,ఈ పనులు చేపట్టి నందుకు ఆయిల్ ఫెడ్ బోర్డ్ కు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పతనం అవుతున్న ధరల పై రైతుల తో చర్చించి,అభిప్రాయాలు సేకరించి, తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయుటకు ప్రయత్నం ప్రారంభించినట్లు వారు ప్రకటించారు. రైతులు తమ సలహాలు సూచనలు అందజేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అద్యక్షులు రావు జోగేశ్వరరావు,మాజీ సర్పంచ్ పుల్లయ్య, తుంబూరు మహేశ్వర రెడ్డి,దారా తాతారావు తదితరులు పాల్గొన్నారు.