పారదర్శకంగా ఓటర్‌ జాబితా రూపొందించాలి

– ఎలెక్టోరల్‌ రోల్‌ అబర్వర్‌ ఈ శ్రీధర్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పారదర్శకమైన ఓటర్‌ జాబితా రూపొందించడంకీలకమని, నకిలీ ఓట్లు లేని ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని ఎలెక్టోరల్‌ రోల్‌ అబర్వర్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ శ్రీధర్‌ అన్నారు. మంగళవారం జెన్‌కో సమావేశ మందిరంలో ఓటరు జాబితాపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రాతో కలిసి ఆయన పాల్గొని మాటా ్లడారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబి తా చాలా కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అవకాశం కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం రూపొందిస్తున్న ఓటరు జాబితాలో అక్టోబర్‌ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్‌ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటరుగా నమోదు చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా ఓటర్‌ నమోదు చేసిన పోలింగ్‌ కేంద్రాలను, అధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అక్కడ ఓటరు జాబితాలో జరిగిన మార్పులపై మరోసారి సమీక్షించాలని సూచించారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఓట్ల వివరాలు ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నాయా, లేవో మరోసారి పరిశీలించాలని తెలిపారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. ఎన్నికల సమయంలో వివిధ అధికారులు పరిశీలనకు సిద్ధం కావాలని సూచించారు. ఓటరు జాబితాకు రూపకల్పనకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశాలు వివరాలు, మినెట్స్‌ కాపీ వివరాలు ఆన్‌ లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని అన్నారు. సంబం ధిత రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మాట్లాడుతూ… జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధి ఎన్నికలు నిర్వహిస్తు న్నామని జిల్లాలో ఇప్పటివరకు 2లక్షల63వేల452మంది ఓటర్ల నమోదు జరిగిందని, 317 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధి ఓటరు జాబితా రూపకల్పన పర్యవేక్షణకు బూత్‌స్థాయి అధికారులను ఏర్పాటు చేశామని, 317 మంది బూత్‌ స్థాయి అధికారులను, ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేలా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. జిల్లాలో 18-19 సంవత్సరాల వయసు గల 7 వేల 591 మంది ఓటర్లను నమోదు చేశామని తెలిపారు. రెండో విడత ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 11,905 దరఖాస్తులు స్వీకరించామని, నిర్దేశిత గడువులోగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టి ఆ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అర్‌డిఓ రమా దేవి , జెడ్పీ సీఈఓ విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా రూపోందించాలి
ఎన్నికల నిర్వహణకు పారదర్శకమైన ఓటర్‌ జాబితా పకడ్బందీగా రూపొందించాలని ఎలెక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ శ్రీధర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ధార్‌ కార్యా లయాన్ని ఆయన పరిశీలించి రికార్డులను పరిశీలించారు అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రమా దేవి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, తహసీల్ధార్‌ సతీష్‌కుమార్‌, డీటీ వినరు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు
పటిష్టమైన ఓటర్‌ జాబితా సిద్ధం చేయాలి
తాడ్వాయి : పటిష్టమైన ఓటరు జాబితాను రూపొం దించాలని ఎలెక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ శ్రీధర్‌ అన్నారు. మంగళవారం తాడ్వాయి మండల తహసీల్ధార్‌ కార్యాలయంను ఆయన సందర్శించి, ఓటర్ల జాబిత పై ఏఈఆర్‌ఓ, సూపర్వైజర్లు, బీఎల్‌ఓలతో సమీక్షించారు. ఓటర్‌ జాబితాలో 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల నమోదు, దివ్యాంగుల నమోదు, ఫారం నంబర్‌ 6 ద్వారా ఓటర్ల నమోదు, 7, 8 ద్వారా మరణించిన, డబల్‌ ఓటర్లు,శాశ్వతంగా వలస పోయిన ఓటర్ల తొలగింపు ప్రక్రియను, చేసిన మార్పులు చేర్పుల తీరును పోలింగ్‌ అడిగి, రికార్డులను పరిశీలించారు. తహసీల్ధార్‌ రవీందర్‌ పాల్గొన్నారు.