రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

– ఓలా,ఊబర్‌లకు ప్రత్యామ్నాయంగా కేంద్రం యాప్‌ తీసుకురావాలి
–  6న రాజ్‌భవన్‌ ముట్టడి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రవాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆ ర్‌టీడబ్ల్యూఎఫ్‌ -సీఐటీయూ అనుబం ధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు ఎస్‌.వీరయ్య, పి.శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. ఓలా, ఊబర్‌లకు ప్రత్యా మ్నా యంగా కేంద్ర ప్రభుత్వమే ఆన్‌ లైన్‌ యాప్‌ తీసుకురావాలని కోరారు. మోటార్‌ వాహన చట్టం-2019ని సవరించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై ఈ నెల ఆరోతేదీన రాజ్‌ భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించా రు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన రవాణారంగ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ, కార్మికశాఖలో వారి పేర్లను నమోదు చేసి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. కార్మికులు కోరిన చోట అడ్డా లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రవాణా రంగంలో పని చేస్తున్న కార్మి కులందరికీ పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పని భద్రత, సరైన పని గంటలు కల్పించి వారిని ఆదు కోవాలని కోరారు.
జాతీయ పిలుపులో భాగంగా రాజ్‌భవన్‌ ముట్టడికి ఆటో, ట్రాక్టర్‌, లారీ, ట్రాలీ, జీపు, ట్రక్కు, స్కూల్‌ బస్సు, అంబులెన్స్‌, హైర్‌ బస్‌, డీసీఎం, మినీ డీసీఎం, హార్వెస్టర్‌, ప్రోక్లైనర్‌, క్యాబ్‌ వాహనాలలో పనిచేసే కార్మికులందరూ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.