– తిరుమలగిరిలో కాంగ్రెస్ సభ సూపర్ సక్సెస్
– మందుల సామెల్ ను 30 వేల మెజార్టీతో గెలిపించండి
– ఉత్సాహం నింపిన రేవంత్ రెడ్డి సభ
– ఇందిరమ్మ రాజ్యం రావాలి
– కాంగ్రెస్ 80 కి పైగా సీట్లతో అధికారంలోకి వస్తుంది
నవతెలంగాణ- తిరుమలగిరి : ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేలును ప్రజలు 30 వేల మెజార్టీతో గెలిపించి బీఆర్‌ఎస్ కి తగిన గుణపాఠం చెప్పాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావ సభలో ఆయన ప్రజలను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న భూధందా, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నీతి నిజాయితీ కలిగిన మందుల సామెల్ ను ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. డిసెంబర్ 9 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, అధికారం చేపట్టిన అనతికాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జైలు గతి పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తూ లక్ష కోట్ల రూపాయలను మింగిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి తీరుతామని ఆయన అన్నారు. 2014, 2018లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాక మొదటిగా దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీని విస్మరించి దళితులకు తీరని అన్యాయం చేశారని అన్నారు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని ఆయన చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటికో ఉద్యోగం లక్ష ఉద్యోగాలు ఇవన్నీ మాయమాటలే నని అన్నారు మాయల మరాఠీ కేసీఆర్ మాటలను నమ్మి ప్రజలు మోసపోయి రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారని అని చెప్పారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. మాయమాటలంతో మోసపోయి ఈ సారి అధికారం ఇవ్వవద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ ప్రభుత్వ భూములన్ని కబ్జా చేశారని అని చెప్పారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పదివేల ఎకరాల భూములన్ని కబ్జా చేసి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల నోట్లో మట్టి కొట్టారని చెప్పారు డబల్ బెడ్ రూమ్ ఇస్తావన్నా హామీ నెరవేరలేదని చెప్పారు. రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా డబల్ బెడ్ రూమ్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన చెప్పారు ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతమై రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కట్టంగట్టాలని చెప్పారు, రానున్నది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పారు . ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం అని పేదలరాజ్యమని, బీఆర్‌ఎస్ రాజ్యం అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం భూముల కొల్లగొట్టే రాజ్యం, అక్రమ ఇసుకరాజ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే కేసీఆర్ పని అయిపోయిందని అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల తుక్కుగూడలో జరిగిన సమావేశంలో ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందని అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే మహిళలకు ప్రతినెలా ఆర్థిక సహాయంతో పాటు 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని అని చెప్పారు. గతంలోకట్టిన ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ ఇస్తామన్నా డబల్ బెడ్ రూమ్ ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఇసుక మాఫియా, భూమాఫియా జోరుగా సాగుతుందని అని చెప్పారు. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు తిరుమలగిరి లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సభ సక్సెస్ కావడంతో తిరుమలగిరి మండల కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి నాయకులు అద్దంకి దయాకర్, ఏఐసీసీ పరిశీలకులు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డివి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేద్కర్, మహిళా నాయకురాలు బాలలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్సొజు నరేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ . గుడిపాటి నరసయ్య, మండల నాయకులు సుంకరి జనార్ధన్, దుంపల కృష్ణారెడ్డి, మూల అశోక్ రెడ్డి, కందుకూరి లక్ష్మయ్య, ఫతేపురం సుధాకర్, ఎల్సోజు నవీన్, కొత్తగట్టు రాజు, ఎండి ఆఫీస్ తోపాటు నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.