మరాఠీ మూలం : గోవింద్ పన్సారీ
పేజీలు : 96, వెల : 90/-,
ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్
ఎం.హెచ్.భవన్, ప్లాట్ నెం.21/1,
అజామాబాద్, ఆర్.టి.సి. కళ్యాణ మండపం దగ్గర,
హైదరాబాద్ – 500030. ఫోన్ : 27673787.
అన్ని నవతెలంగాణ పుస్తక కేంద్రాలు.
మతోన్మాదులు ఫిబ్రవరి 2015లో గోవింద్ పన్సారేను హత్య చేశారు. అంతకుముందే 2013లో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేసే హేతువాది నరేంద్ర ధబోల్కర్‌ను హత్య చేశారు మతోన్మాదులు. 1970లోనే సి.పి.ఐ. నేత కృష్ణదేశాయిని చంపారు. బాల్‌థాకరే లాంటి వారు కమ్యూనిస్టులు ఎక్కడ కనిపించినా సరే మట్టుబెట్టాలని శివసేనికులతో బాహాటంగానే చెప్పారు. ప్రత్నామ్నాయ దృక్కోణంతో సత్యాలు – వాస్తవాలు – నిజాలు చెప్పే వైజ్ఞానిక వేత్తలను చంపడం క్రీ.పూ. నుండే ఆరంభమైంది. శివాజీ చరిత్రను, జీవితాన్ని పరిశోధనాత్మకంగా పన్సారే రాశారు. ఆ రచనను ఆంగ్లంలో ఉదరు నార్కర్, తెలుగు అనువాదాన్ని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్.వినరుకుమార్ చేశారు. పురాతత్వ పత్రాలు, గ్రంథాల ఆధారంతో రాశారు. 17వ శతాబ్దంలో మొఘల్, పోర్చుగీసు, ఫ్రెంచి చరిత్రలను బట్టి తన సమకాలీన మిత్రులను, శత్రువులను బట్టి నైరుతి భారతంలో శివాజీ ఆజేయమైన నాయకుడని చెప్పొచ్చు. శివాజీ చరిత్రను 1826 తర్వాతే పాఠ్యాంశాల్లో పాలకులు చేర్చారు. శివాజీని గుడ్డిగా ముస్లిం ద్వేషిగా చిత్రించిన కీర్తి ప్రాచ్య ప్రపంచం పట్ల దుర్మార్గమైన అవగాహన గల గ్రాంట్‌డఫ్‌కు దక్కుతుంది. ‘శివాజీ కోన్ హోతా?’ గ్రంథం చూస్తే గాని మనకు శివాజీపై సరైన దృక్పథం కలగదు. రాజులను, ప్రభువులను చరిత్ర చెత్తకుండీలోకి తోసేసింది. దాని స్థానంలో ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ఇతర రాజుల కంటే శివాజీ భిన్నమైన వాడు. తమ అభ్యున్నతే లక్ష్యంగా శివాజీ పరిపాలిస్తున్నాడని ఆ రాజ్యంలోని రైతులు, సాధారణ ప్రజలు, మహిళలు అర్థం చేసుకున్నారు. ఈ పుస్తకం చివర శివాజీ లేఖలు ప్రచురించారు. అవి 1673 ప్రాంతంలో పాలనాపరంగా రాసినవి. శివాజీ పేరు చెప్పి… ముస్లింలు, దళితులపై దాడి, వారికి లభించే రిజర్వేషన్లపై వ్యతిరేకత చూపాయి మతోన్మాద శక్తులు. ఈ పనులన్నీ శివాజీ భావాలకు విరుద్ధమైనవి. శివాజీ చరిత్ర ఉన్నట్లుగానే కర్నాటకుకు రాణి చెన్నమ్మ చరిత్ర, రాజస్థాన్‌కు రాణా ప్రతాప్ చరిత్రలున్నాయి. శివాజీ ఫ్యూడల్ హక్కులను ఈసడించుకున్నాడు. తన రాజ్యంలో ఎవరికీ ఫ్యూడల్ హక్కులు ఇవ్వలేదు. సతారా మ్యూజియంలో వున్న శివాజీ ఆ ఖడ్గంపై పోర్చుగీసు అక్షరాలు చెక్కి వున్నాయి. చరిత్రకు పుకార్లకు తేడా తెలియాలి. శివాజీ హిందూ ఛాందసుడు కాదు. లౌకిక పోషలిస్టూ కాదని (పేజి 67) అర్థం చేసుకోవాలి. జిజియా పన్నుకు వ్యతిరేకంగా ఔరంగజేబుకు శివాజీ లేఖలు రాశాడు. అక్బర్, జహంగీర్, షాజహాన్‌లు పరమత సహనం చూపారు. పరమతాల జోలికి శివాజీ ఎక్కడా, ఎప్పుడూ వెళ్లలేదు (సూరత్ లూటీ చేసే కాలంలో). మరాఠాలపై, హిందువులపై శివాజీ యుద్ధాలు చేశాడు (పేజీ 56). జైసింగ్ చేతుల్లో 1665 లో శివాజీ ఓడిపోయాడు. ఇలా ఎన్నో ఆశక్తికర వాస్తవ అంశాలు శివాజీ గురించి తెలిపే మంచి పుస్తకం ఇది.
– తంగిరాల చక్రవర్తి, 9393804472