యూనివర్సిటీ లో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించే వీసిని నియమించాలి..

– రిజిస్ట్రార్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతిపత్రం పంపాలని వెడుకోలు..
– పి.డి.ఎస్.యూ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణాన్ని పెంపొందించే వీసిని నియమించాలని పి.డి.ఎస్.యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ లు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ లోని పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి ద్వారా పంపించాలని కోరుతూ పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తెలంగాణ యూనివర్సిటీ లో గత రెండు నెలలుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, లంచం తీసుకుంటూ పట్టుపడ్డ వీసీ జైలు పాలయ్యాడని, తెలంగాణ యూనివర్సిటీ లో అకడమిక్ వాతావరణాన్ని నెలకొల్ప గల అన్ని అర్హతలు ఉన్న వారిని యూనివర్సిటీ వీసీగా నియమించాలని, యూనివర్సిటీలో బోధనను మెరుగుపరచాలని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పీజీ సీట్లను మొత్తం భర్తీ చేయాలని, యూనివర్సిటీలో నూతనంగా గర్ల్స్ హాస్టల్ ను నిర్మించాలని, యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల ఆఫీలేషన్ ఫీజులను వసూలు చేసి యూనివర్సిటీ అభివృద్ధికి వాడాలని, పీజీ, పిహెచ్డి విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వాలని, వీసీ అవినీతికి సహకరించినటువంటి వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, జయంతి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రిన్స్, పి.డి.ఎస్.యూ నాయకులు లక్ష్మీనారాయణ, గంగాధర్, అక్షయ్, యశ్వంత్, శివసాయి,ఆకాష్, అశ్విత్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.