ఎన్నికల తోటలో తిట్ల చీడ

Neti Vyasamపలికే భాషలో
ఏ మాటలు ఎలా ఉన్నా
అక్షరాల చెట్ల మధ్యలో
అనంత తిట్ల కలుపు
నేతల నోటి తోటలో
ఇంత కలుపు ఎందుకొచ్చిందో?
ఓ! ఇది ఎన్నికల ఋతువట కదా!
అందుకే నేమో!
ఆగకుండా ఎన్నికల వీధులు
ముంచెత్తేలా తిట్లవర్షం కురుస్తోంది
తొందర తొందరగా ముగించి
కలుపు మొత్తం పీకండిరో
లేకుంటే సమస్యల మొక్కలు
కనపడకుండా ఎండి పోతాయి
ఎర్రచెట్లు తప్ప మరే చెట్లూ
వాటిని కాపు కాయనివ్వవుగా
సమస్యలు లేని కాపు దిగాలంటే
తిట్ల కలుపు తీయక తప్పదు
తిట్ల కలుపుతోనే పొట్ట నింపుకునే
చెట్లను ఓటు కత్తితో నరికెయ్యాలి
సమస్యల వనాల్లో
పూత పూయించాలనే వాళ్ళు కదలండిక
అదునులో కొడవలి పడితేనే
ఈ కలుపు పీడ వదిలేది
-ఉన్నం వెంకటేశ్వర్లు