పుప్పాలపల్లిలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య

నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని పుప్పాలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి తెలిపారు. పుప్పాలపల్లి గ్రామానికి చెందిన దావుల లతాకు 11 సంవత్సరాల క్రితం పెండ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం బంధువుల ఇంటికి భార్య భర్తలు ఫంక్షన్కు వెళ్లి వచ్చారని, సోమవారం ఉదయం చూసేసరికి అంటే దావుల లత ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. లతకు ఆరోగ్యపరంగా నరాల బలహీనతతో బాధపడుతోందని, లతా భర్తతో ఇతరులకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని ఎస్సై తెలిపారు. మృతురాలు దావుల లత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.