శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆదివారం శ్రీచైతన్య స్కూల్‌ తమ ఇంటర్‌ స్కూల్‌ స్టేట్‌ లెవెల్‌ కాంపిటీషన్‌ ఫియెస్టా- ఎ బోకె ఆఫ్‌ ఇన్‌హరెంట్‌ టాలెంట్స్‌-2023 కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నారథాన్‌- స్టోరీ నెరేషన్‌, అబాకస్‌, చిత్రకళ (డ్రాయింగ్‌) మూడు విభాగాలను స్కూల్‌ స్థాయి నుంచి జోనల్‌ స్థాయి, జోనల్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన తెలంగాణలోని 500 మందికిపైగా విద్యార్థులతో గ్రాండ్‌ ఫినాలే విజయవంతంగా నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు.