టెక్నాలజీ రోజురోజుకు అభివద్ధి చెందుతూ అనేక ఆవిష్కరణలకు వేదికవుతున్నది. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్ వినియోగంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించేవారు, క్రియేటివిటి ఉన్న వారు యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసుకుని ఆదాయాన్ని సష్టించుకుంటున్నారు. యూట్యూబ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. విభిన్నమైన కంటెంట్‌తో వీడియోలు చేస్తూ దానికి క్రియేటివిటి జోడించి మిలియన్ల కొద్ది వ్యూస్‌ను రాబడుతున్నారు. ఇదే కోవలో ప్రపంచ యాత్రికుడిగా పేరొందిన యూట్యూబర్ అవినాష్ ప్రపంచ దేశాలను చుట్టేస్తూ మంచి మంచి వీడియోలు చేస్తూ నెంబర్ వన్ యూట్యూబర్‌గా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఔరా.. అనిపిస్తున్నాడు. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసుకుని ప్రపంచ దేశాలను తిరగేస్తున్నాడు. తాజాగా నెల రోజులకు సంబంధించిన యూట్యూబ్ నుంచి ఏకంగా రూ. 30 లక్షలు పొందినట్టు వీడియోలో అవినాష్ స్పష్టం చేశాడు. దాదాపు 85 దేశాలకు పైగా పర్యటించి, అక్కడి విశేషాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన అన్వేష్ చిన్ని అనే యూట్యూబర్. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఈ పర్వతం టాంజానియాలోని ఈశాన్య ప్రాంతంలో ఉంది. 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్న తర్వాత, అతను భారత జాతీయ జెండాను ఎగురవేసి, ‘జై జవాన్ జై కిసాన్’, ‘వందేమాతరం’ వంటి నినాదాలతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. అన్వేష్ ‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. అక్కడ అతను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తన ప్రయాణాలు, అన్వేషణలకు సంబంధించిన కంటెంట్‌ను పంచుకుంటాడు.
నా అన్వేషణ ఎలా ఉంది?
ఇటీవల యూరోప్‌లోని సెర్బియా పర్యటనలో, తనను తాను ”ప్రపంచ యాత్రికుడు” అని పిలుచుకునే తెలుగు యూట్యూబర్‌కు అసాధారణమైన సమస్య ఎదురైంది. ‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు 2,20,000 మంది ఫాలోవర్లు ఉన్న అన్వేష్ ప్రపంచ పర్యటనలో ఉన్నారు. సెర్బియాలోని ఒక హోటల్‌లో ప్రవేశించినప్పుడు అతను నిరంతరాయంగా కాకి దాడికి గురయ్యాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియో 1,00,000 వీక్షణలతో వైరల్‌గా మారింది. పక్షి తరచుగా తనను వెంబడించి దాడికి ప్రయత్నించిందని, తన భద్రత గురించి భయపడుతున్నానని అతను విలపించాడు. ”అది నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది. దాని నిరంతర వేటకి నేను భయపడుతున్నాను” అని పెట్టిన వీడియో వైరల్ అయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మరింత విస్తతంగా మారినందున, అన్వేష్ వంటి కంటెంట్ సష్టికర్తలు వారి వినోదాత్మక, సమాచార వీడియోలతో గణనీయమైన ఫాలోయింగ్‌ను సంపాదించారు. అయితే, కొంతమంది క్రియేటర్‌లు తమ సంబంధాలతో సహా వారి వ్యక్తిగత జీవితాల గురించిన వివరాలను పంచుకుంటుంటారు. మరికొందరు గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. నేడు ప్రపంచానికి సమాంతరంగా మరో వినూత్నమైన ప్రపంచంగా ఇంట ర్నెట్ ఉంది. దీనినే మనం వర్చువల్ వరల్డ్ అంటున్నం. ఈ ఆధునిక యుగంలో ఆంతరంగిక స్వేచ్ఛ అన్నది ఒక అభూత కల్పనగా మారే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా లో మరెన్నో నెట్‌వర్కింగ్ సైట్లలో ఎన్నో విధాలుగా చాలామంది తమ సమా చారాన్ని చేజేతులారా తామే జారవిడుస్తూ ఆంతరంగిక స్వేచ్ఛ ను కోల్పోతున్నారు. ఆ తరువాత గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరమే. ఆ గోప్యతను ఇతను పాటించడం అభినందించదగ్గ విషయమే.
వ్యక్తిగతYouTube ఛానెల్‌ల ఆర్థిక వివరాలు పబ్లిక్‌గా అందుబాటులో లేనప్పటికీ, నా అన్వేషణ ఛానెల్ ద్వారా భారీగానే ఆదాయం వస్తున్నట్టు అతడే వెల్లడించాడు. అయితే,YouTube ఛానెల్, కంటెంట్‌ని సష్టించడం అనేది చాలా సమయం తీసుకునే, శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని గమనించడం ముఖ్యం. ఆర్థిక రివార్డులు గణనీయంగా ఉన్నప్పటికీ, అన్వేష్ వంటి కంటెంట్ సష్టికర్తలు ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కొనసాగించడం, ఆన్‌లైన్ కీర్తి ఒత్తిడిని తట్టుకుని నిర్వహించడం వంటి సవాళ్లతో కూడా పోరాడాలి.
క్యూబా విశేషాలు
అన్ని దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోందని, అక్కడ ప్రజలందరూ సమానమే అని చెప్పిన అన్వేష్ .. అది కమ్యూనిస్టు దేశం కాబట్టే సాద్యమైందని తెలిపాడు. ప్రపంచంలో అత్యధిక అక్షరాక్ష్యత గల దేశంగా క్యూబాను మరోసారి తన యూట్యూబ్ ద్వారా పరిచయం చేశాడు. ప్రతి పది మందిలో ఒకరు డాక్టరని… ప్రజారోగ్యంపై వారికుండే శ్రద్ద గురించి కూడా తెలిపాడు. తక్కు వ ఖర్చుతో అక్కడి ప్రజల జీవనం గురించి తెలిపాడు. చే, ఫెడేల్ కాస్ట్రో మ్యూజియం విశేషాలు తెలియజేశాడు.
ఏకంగా దేశ ద్రోహి అనేస్తున్నారు
చైనా టూర్‌లో ఉన్నప్పుడు చేసిన వీడియోస్ ఎంతలా ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. ఆ ఫీడ్ బ్యాక్‌తో ఫుల్ ఖుష్ అయిపోయిన అన్వేష్.. పనిలో పనిగా చైనాలోని పాపులర్ ప్లేసెస్‌ని విజిట్ చేసి మరిన్ని క్రేజీ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కట్ చేస్తే, చైనా నుండి రిటర్న్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత షేర్ చేసిన వీడియోలో ఇది చైనాలో ఆఖరి వీడియో అని చెప్పాడు. అక్కడి నుండి హాంకాంగ్ వెళ్తున్నానని అన్నాడు. ‘బాధపడకండి, మళ్లీ ఎలక్షన్స్ అయిపోయాక వచ్చి, చైనాని దుమ్ము దులిపేద్దాం. ‘ అంటూ క్లారిటీ ఇవ్వకుండా చెప్పుకొచ్చాడు.
కాగా అన్వేష్ ఇలాంటి సడెన్ డిసిషన్ తీసుకోవడం వెనుక కొన్ని బలమైన రాజకీయ కారణాలున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చైనాలో చేసిన ఓ వీడియోలో.. అక్కడి యువత జీవన విధానం గురించి చెప్తూ.. మన యువత రాజకీయ నాయకుల వెనుక జెండాలు పట్టుకుని తిరుగుతూ వాళ్లని గొప్పవాళ్లని చేస్తున్నారు తప్ప మీరు ఎదగలేకపోతున్నారు అంటూ పాజిటివ్‌గానే చెప్పాడు. నీతులు చెప్తే తిరిగి బూతులు తిట్టే రోజులు కాబట్టి.. ఈ వీడియో తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఏకంగా దేశ ద్రోహి అనేస్తున్నారని స్వయంగా అన్వేష్ చెప్పాడు. కట్ చేస్తే, ఇప్పుడు ఆ బెదిరింపుల కారణంగానే తను టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు!
శోధించి సాధించు అన్నట్టుగా యూట్యూబర్ అవినాష్ ప్రపంచ దేశాలను చుట్టేస్తూ డిఫరెంట్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ లక్షల్లో వ్యూస్ పొందుతున్నాడు. రోజుకో వీడియో చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. తను అనుకున్నట్లుగానే క్రియేటివ్ కంటెంట్ తో వీడియోలు రూపొందించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాడు. ప్రస్తుతం ఫిజిలో పర్యటిస్తున్నాడు. ఈ రోజుల్లో ఓ యూట్యూబ్ చానల్ కు అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఆశామాషి వ్యవహారం కాదు. దాని వెనకాల చాలా కషి ఉంటుంది. యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కొత్తలో అంతంతే ఆదాయం వచ్చిందని చెప్పిన ఆయన ఎన్నో ఒడిదుడుకుల తర్వాత లక్షల్లో ఆదాయం సంపాదిస్తు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. యూట్యూబర్లుగా తెలుగులో చాలామందే ఫేమస్ అయ్యారు. కానీ అవినాష్ వారందరికంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని సక్సెస్ అయ్యాడు. లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ నెంబర్ వన్ తెలగు యూట్యూబర్ గా హిస్ట్రీ క్రియేట్ చేస్టున్నాడు.
– మోహన్