బోసి నవ్వులతో ప్రపంచం

తరాలుగా
చందమామ రావే… జాబిల్లి రావే అని
పసివాడి నోట పలికిన జాబిలి ప్రేమ
చంద్రయాన్‌ యాత్రతో దగ్గరై
వెన్నెల వాకిట అడుగెట్టి
చందమామను ముద్దాడిన
మన భారతమాతను చూసి
బోసి నవ్వులతో ప్రపంచం కేరింతలు కొట్టింది.
– చందలూరి నారాయణరావు, 9704437247