యువకుడిని రక్షించబోయి..మరో యువకుడు..

– ప్రమాధవశాత్తు వరదకాల్వలో జారిపడిన యువకుల మృతి
– ఎస్ఐ అధ్వర్యంలో గాలింపు చేపట్టిన జాలరులు
నవతెలంగాణ – బెజ్జంకి
వరదకాల్వలో నీటీలో ప్రమాధవశాత్తు జారిపడిపోయిన యువకుడిని గమనించిన మరో యువకుడు రక్షించబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. సంఘటనలో స్థలంలో ఉన్న మరో యువకుడు గాలిపెల్లి ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం హైదబాద్ పట్టణానికి చెందిన దావ రోహిత్(16) స్థానిక చిలుముల పవన్(22) కుటుంబానికి సమీప బంధువు.స్థానిక యువకుడు గాలిపెల్లి ఉదయ్ కిరణ్ తో కలిసి ముగ్గురు యువకులు వరదకాల్వ వద్ద కాలక్షేపం చేయడానికి వేళ్లారు.రోహిత్ వరదకాల్వలో చేతులు శుభ్రపర్చుకోవడానికి వేళ్లగా ప్రమాధవశాత్తు నీటీలో జారిపడిపోయాడు.గమనించిన పవన్ రక్షించేందుకు వరదకాల్వలో దూకడంతో వరదకాల్వ గట్టుమీదున్న మరో యువకుడు ఉదయ్ కిరణ్ నీటీలో పడిపోయిన యువకులను రక్షించడానికి అందుబాటులో ఉన్న తాడును అందజేయడానికి ప్రయత్నించగా చిన్నగా ఉండడంతో నీటీలో గల్లంతయ్యారు.యువకులు నీటీలో పడిపోయారని ఉదయ్ కిరణ్ వీరాపూర్-తోటపల్లి ప్రధాన రోడ్డుపైకి వచ్చి కేకలు వేయసాగాడు.గమనించిన స్థానికులు వరదకాల్వ వద్దకుచేరుకునే సమయానికి ఇద్దరు యువకులు పూర్తిగా వరదకాల్వలో గల్లంతయ్యారు. సమచారం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ రాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.అట్ల రాములు(దాచారం), పోలవేణీ సంపత్(తోటపల్లి) జాలర్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.మృతుడు పవన్ తల్లి లక్ష్మి పిర్యాదు మేరకు ఎస్ఐ ప్రవీణ్ రాజు కేసు నమోదు చేసి మృతదేహలకు పంచనామ నిర్వహించి పోస్ట్ మార్టమ్ కు తరలించారు. మృతుడు పవన్ ప్రమాధవశాత్తు నీటీలో మృతి చెందడం.. గతంలో తండ్రి అంజయ్య బావి ప్రమాధంలో మృతి చెందడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.మరో మృతుడు రోహిత్ తండ్రి కొన్నెండ్ల క్రితం మృతి చెందినట్టు సమచారం.