
డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో ఆస్తి తగదాలతో అన్నదమ్ముల మధ్య గొడవతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డ తమ్ముడు అనిల్ ను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స కోసం తరలించారు.స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన అనిల్ (39) కి ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గతంనుండి గొడవలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఆదివారం రాత్రి గోడలు చోటుచేసుకోవడం తో మనస్థాపానికి గురైన తమ్ముడు అనిల్ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అప్పటికప్పుడే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సెల్ఫీ సూసైడ్ అటెంప్ట్ వీడియోను తన పదోతరగతి స్నేహితులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఇంట్లో ఆస్తి తగాదాల వల్ల ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నాడు. న్యాయం చేస్తామని పంచాయతీ పెట్టించి చివరికి తనకు అన్యాయం చేశారని అనిల్ వాపోయాడు.స్నేహితులను విడిచి పోతున్నందుకు చాలా బాధగా ఉందని,నా భార్య, పిల్లలకైన న్యాయం చేయాలని అనిల్ తన స్నేహితులకు గోడును వెళ్లగక్కి పురుగుల మందు తాగాడు.ఇదే విషయమై డిచ్ పల్లి ఎస్ఐ ను వివారణ కోరగా కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.