బ్యాంక్ అకౌంటుకు ఆధార్ అనుసందానం తన్పనిసరి..

పత్తి రైతులకు ఆత్మాధికారి సాయి చరణ్ సూచన
నవతెలంగాణ-బెజ్జంకి :
సీసీఐ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించే రైతులు తమ బ్యాంక్ ఆకౌంటుకు ఆధార్ తో పాటు మొబైల్ నంబర్ అనుసందానం తప్పనిసరని ఆత్మాధికారి సాయి చరణ్ మంగళవారం తెలిపారు. పత్తి రైతులు తమ బ్యాంక్ ఆకౌంటుకు ఆధార్ తో పాటు మొబైల్ అనుసందానం లేకపోతే నగదు బదిలీ చేయడంలో సమస్యలు తలెత్తుతాయని రైతులు మీ సేవా కేంద్రాల్లో అనుసందానం చేసుకోవాలని సాయి చరణ్ తెలిపారు.