ఆశీర్వాద్‌ పైపులనే వాడాలి

– వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల
– మార్కెటింగ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ సురేందర్‌
నవతెలంగాణ- ములుగు
రైతులు నాణ్యతతో కలిగి ఉన్న నమ్మకమైన ఆశీర్వాదం పైపుల ను మాత్రమే వాడేలా బోర్‌ మెకానిక్స్‌ అవగాహన కల్పించాలని ఆశీర్వాద్‌ వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల మార్కెటింగ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ సురేందర్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తిరుమల ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, వైన్డింగ్‌ వర్క్స్‌ యజమాని, ఆశీర్వాద్‌ పైప్స్‌ డీలర్‌ సుంకరి రవీందర్‌ ఆధ్వర్యంలో ఆశీర్వాద్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో బోర్‌ మెకానిక్‌ లకు మెగా అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్‌ మాట్లాడుతూ ఆశీర్వాద్‌ కంపెనీ పైపులు నాణ్యతలో నంబర్‌ వన్‌ గా ఉంటుందని అన్నారు. ప్రస్తుత మార్కెట్లో ఆశీర్వాద్‌ పైపులు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయని, పైపులపై రైతుల్లో నమ్మకం కలిగిందని అన్నారు. సుమారు వందమంది బోరు మెకానికులు పాల్గొన్నారు.