అబ్దుల్ కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి..

– అబ్దుల్ కలాం సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి బండమీది కరుణాకర్  
నవతెలంగాణ-చేర్యాల
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అబ్దుల్ కలాం సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి బండమీది కర్ణాకర్ అన్నారు.అబ్దుల్ కలాం 8వ వర్ధంతి సందర్భంగా గురువారం అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కరుణాకర్ మాట్లాడుతూ దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు ఎనలేనివన్నారు. క్షిపణి శాస్త్రవేత్తగా,రాష్టపతిగా అబ్దుల్ కలాం దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలాలకు విస్తరించారని అన్నారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం సేవా సంస్థ ఉపాధ్యక్షులు గడ్డల మహిపాల్, ఉప సర్పంచ్ ప్రజ్ఞాపూర్ ఎల్లేశం, మాజీ వైస్ ఎంపీపీ కుందారపు రాములు, సంస్థ ప్రతినిధులు గూడెపు మహేష్, నాగపురి సత్యనారాయణ, బండకింది నర్సింహులు, తుమ్మ వెంకటేశం పాల్గొన్నారు.