నవతెలంగాణ- నవీపేట్ : మండలంలోని అభంగపట్నం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. గతంలో 2018 ఎన్నికల్లో సమస్యాత్మకంగా రెండు పోలింగ్ బూత్ లను గుర్తించగా ప్రస్తుతం లేకపోవడంతో పరిశీలించేందుకు వచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయిందని ప్రస్తుతం కేసు రాజీకాగా కొట్టివేశారని అన్నారు. బాధితులతో పాటు గ్రామస్తులను విచారించగా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏమీ లేదని గుర్తించామని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఓట్లు వేసేందుకు తగిన వాతావరణం ఉందని ఏదైనా సమస్య వస్తే బైండోవర్ లాంటివి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.