ఏసిబి వలన సబ్ రిజిస్టర్..  బాన్సువాడలో ఏసీబీ దాడులు 

నవతెలంగాణ -నసురుల్లాబాద్ 
బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలలో పడ్డారు. డాక్యుమెంట్ల కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాన్సువాడ డివిజన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాన్సువాడ పట్టణానికి చెందిన ఉమామహేశ్వర్ తన తండ్రి పేరు పై ఉన్న పాత ఇంటి మ్యుటేషన్ సర్టిఫికెట్  కొరకు ముగ్గురు అన్నదమ్ములకు పంపకం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకై సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళగా ఏదో కారణం చెప్పి ఇందులో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు తెలుపగా, ముగ్గురిపై రిజిస్ట్రేషన్ కావాలంటే పదిహేను వేలు ఇవ్వాలంటూ సబ్ రిజిస్టర్ డిమాండ్ చేశారని, డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని, తమ తండ్రి ఆస్తిని తాము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామని అందుకు పత్రాలు చూసి రిజిస్టర్ చేయాలని కోరగా 15వేలు ఇస్తేనే రిజిస్టర్ చేస్తానని సూచించడంతో చేసేది ఏమీ లేక అక్టోబర్ 16న ఉమామహేశ్వర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బుధవారం మధ్యాహ్నం సబ్ రిజిస్టర్ కార్యాలయం కు వెళ్లగా తన వద్ద డబ్బులు లేవని వివరించగా సరే 9 వేలు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించడంతో చేసేదేం లేక సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది యూనిస్ కు  9 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాయంత్రం వరకు కార్యాలయంలో వివిధ సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ ను పట్టుకున్నారని సమాచారం తెలియడంతో బాన్సువాడ పట్టణంలో ఉన్న రైటర్లు, బ్రోకర్లు వరి కార్యాలయాలకు తాళాలు వేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. సబ్ రిజిస్టర్ సతీష్ కు సహకరించిన సిబ్బందిపై సబి రిజిస్టర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు ఈ దాడిలో  ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ ఎస్సై లు  శ్రీనివాస్, నగేష్, వెంకట్ రావ్  గౌడ్, తదితరులు ఉన్నారు.