రైతు బీమా దరఖాస్తులు స్వీకరణ.. 

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ నాగారం, ఉమ్మాపూర్ గ్రామాలలోని రైతులకు మంగళవారం ఏఈఓ ప్రణీత  రైతు బీమా దరఖాస్తులను పరిశీలించి నమోదు చేశారు. దీంతోపాటు వానకాలం పంట సాగు వివరాలను నమోదు చేశారు. కొత్త పట్టాదారు పాసుబుక్కులు కలిగిన  రైతులు రైతు బీమా దరఖాస్తు చేసుకోవలన్నారు.